సృష్టి పిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసుల దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి. పేదరికం ఇతర సమస్యల వల్ల పుట్టిన బిడ్డలను పెంచుకోలేని మహిళలే టార్గెట్‌గా ఈ అక్రమ దందా కొనసాగింది.

ముఖ్యంగా సరోగసి పేరిట బిడ్డలను పుట్టిస్తామని దంపతుల వద్ద భారీ మొత్తాన్ని తీసుకునేవారు. వారికి పేదరికంలో వున్న మహిళలకు పుట్టిన బిడ్డలను అప్పగించినట్లుగా తేలింది.

Also Read:హైదరాబాదులోనూ నమ్రత మోసాల బాగోతం: దంపతుల ఫిర్యాదు

ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. తాజాగా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సృష్టి ఆసుపత్రికి చెందిన వారితో పాటు కొందరు ఏజెంట్లు కూడా ఉన్నారు.

లావణ్య అనే మహిళ చిన్నారిని వేరొకరికి విక్రయించినట్లు గుర్తించారు. పేదలను టార్గెట్ చేసి ఆడపిల్లకి లక్షన్నర, మగబిడ్డకు రెండున్నర లక్షలు ఇస్తామని వీరు ఎర వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లావణ్య బిడ్డని కోల్‌కతాకు చెందిన  దంపతులకు సృష్టి సిబ్బంది విక్రయించారు.