ట్విస్ట్: ప్రియుడితో కాకుండా మరో వ్యక్తితో పెళ్ళి, భర్తకు షాకిచ్చిన వైఫ్

Srikakulam: Newly-wed woman stabs her   husband in the throat
Highlights

పెళ్ళైన 20 రోజులకే భర్తకు షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: ప్రియుడితో కాకుండా మరో వ్యక్తితో పెళ్ళి, భర్తకు
షాకిచ్చిన వైఫ్,అరెస్ట్

శ్రీకాకుళం: ప్రేమించిన వ్యక్తిని కాదని మరో వ్యక్తితో వివాహం
చేయడంతో  పెళ్ళైన 20 రోజులకే  భర్తను కత్తితో గొంతు కోసి
చంపాలనుకొన్న  నవ వధువును శ్రీకాకుళం జిల్లా పోలీసులు
అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో ఈ తరహా ఘటన
మరిచిపోకముందే శ్రీకాకుళం జిల్లాలో కూడ అదే తరహా
ఘటన చోటు చేసుకొంది.నిందితురాలికి  కోర్టు 14
రోజులపాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధించింది.


శ్రీకాకుళం జిల్లాలోని మాలనర్సాపురం గ్రామానికి చెందిన
బుడ్డా నవీన్ కుమార్ గొదలాం గ్రామానికి చెందిన నీలిమతో
20 రోజుల క్రితం వివాహమైంది. 

అయితే నవీన్ కుమార్ పై భార్య నీలిమ కత్తితో గొంతుకోసి
చంపేందుకు ప్రయత్నించింది. అయితే తీవ్ర గాయాలతో
నవీన్‌కుమార్ చావు బతుకుల మధ్య
కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణానికి పాల్పడిన
నీలిమను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ వ్యవహారమే కారణమా?
  
నీలిమ ఎంపీసీలో 868 మార్కులతో  ఉత్తీర్ణులైంది.  
ఇటీవలనే తండ్రి రామారావు ప్రమాదశాత్తు మేడ మీద నుండి
కిందపడి మృత్యువాతపడ్డాడు. నీలిమ వివాహం కోసం
బంధువులు సహాయం చేశారు. అయితే తాను ప్రేమించిన
వ్యక్తిని పెళ్ళి చేసుకొంటానని నీలిమ కుటుంబసభ్యులను
ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ, కుటుంబసభ్యులు
అంగీకరించలేదు. దీంతో ఆమె నవీన్‌ను  వివాహం
చేసుకొంది.

20 రోజుల పాటు నవీన్ తో నీలిమ బాగానే ఉన్నట్టు
నటించింది. సోమవారం నాడు మాల నర్సాపురం గ్రామానికి
తిరిగివస్తుండగా తనతో తెచ్చుకొన్న కత్తితో నీలిమ నవీన్
గొంతు కోసింది.  నవీన్ కేకలు వేయడంతో పొలాల్లో
పనిచేస్తున్న రైతులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

 ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపితే  అసలు విషయం
వెలుగుచూసింది. ప్రేమికుడితో వివాహం కాకపోవడంతోనే
నవీన్ ను హత్య చేయాలని నీలిమ కుట్ర పన్నినట్టుగా
తేలిందని  కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు.


 
 

loader