టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం నాడు సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

శ్రీకాకుళం: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం నాడు సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

నిమ్మాడలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి అప్పన్నను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకొన్నారనే కేసులో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఫిబ్రవరి రెండో తేదీన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.

అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సోమవారం నాడు బెయిల్ మంజూరు చేస్తూ సోంపేట అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.

అచ్చెన్నాయుడితో పాటు మరో 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో అచ్చెన్నాయుడికి బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.అచ్చెన్నాయుడికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం నాడు ఉదయం జైలు నుండి అచ్చెన్నాయుడు విడుదల కానున్నారు.