శ్రీగౌతమి హత్య: ఆ రోజు ఏం జరిగిందంటే?

Sri Gowthami murder case: What happened that day
Highlights

శ్రీగౌతమి కేసులో కీలక మలుపు:  హత్యగా సీఐడీ నిర్ధారణ

ఏలూరు: శ్రీగౌతమి  మృతి విషయంలో  ఆమె సోదరి పావని మొదటి నుండి చెబుతున్నట్టుగానే వాస్తవాలను సీఐడీ అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంగా ఈ కేసును మూసి వేసినా పావని చేసిన పోరాటంతో సీఐడీ అధికారులు అసలు వాస్తవాలను వెలికితీశారు. ఏడాదిన్నర తర్వాత  ఈ కేసులో వాస్తవాలను  సీఐడీ అధికారులు బయటపెట్టనున్నారు. పథకం ప్రకారంగానే తమ వాహనాన్ని పోలీసులు ఢీకొట్టారని  పావని ప్రకటించింది.

2017 జనవరి 18వ తేది రాత్రి పూట శ్రీగౌతమి, పావనిలు స్కూటీపై  ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుండి వచ్చిన ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీగౌతమి అక్కడికక్కడే మరణించింది. పావని తీవ్ర గాయాలతో  ప్రాణాపాయం నుండి బయటపడింది.

అసలు ఆ రోజు ఏమైందనే విషయాన్ని ఆమె మీడియాకు వివరించింది. ఆసుపత్రిలో చెకప్ చేయించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా  తమ వెనుకనే ఓ ఇన్నోవా వాహనం అనుసరించినట్టుగా పావని చెప్పారు. అయితే తమ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేయాలని  తాను కోరినట్టు చెప్పారు.  వాహనం వెళ్ళిపోయేంత స్థలం ఉందని  శ్రీగౌతమి తనతో చెప్పిందన్నారు.

ఈ సంభాషణ జరిగిన కొద్దిసేపట్లోనే వెనుక నుండి వచ్చిన  వాహనం తమను ఢీకొట్టిందని పావని చెప్పారు. స్పీడ్‌గా వచ్చి ఢీకొట్టడంతో తాను కారు ముందు భాగంలో పడిపోయానన్నారు. తాను కారును నిలిపివేయాలని ఎంతగా అరిచినా కానీ పట్టించుకోకుండా స్పీడ్‌గా వావాహనాన్ని నడుపుతూ  మరోసారి ఢీకొట్టారని పావని చెప్పారు. రోడ్డుప్రమాదమైతే పొరపాటున ఢీకొట్టి వెళ్లేవారన్నారు. కానీ, రెండోసారి ఢీకొట్టడం వెనుక తమను హత్య చేయాలనే ఉద్దేశ్యం ఉందని తనకు అర్ధమైందని పావని అభిప్రాయపడ్డారు. 

రెండు సార్లు బలంగా ఢీకొట్టడం వల్ల  శ్రీగౌతమికి తీవ్రంగా గాయాలయయ్యాయని పావని చెప్పారు.  అయితే  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. శ్రీగౌతమి సోదరి పావని మాత్రం ప్రాణాలతో బయటపడింది. తన సోదరి మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనలో భాగంగా సీఐడీ అధికారుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. 

ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  ఓ టీడీపీ నేతకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు సమాచారం. విశాఖలోని ఓ ట్రావెల్స్‌ నుండి వావాహనాన్ని బుక్ చేసుకొని ఈ హత్యకు ఉపయోగించారని పోలీసుల విచారణలో తేలింది. 

loader