ఇటువంటి పరిస్ధితిలోనే ‘టిడిపి అభ్యర్ధి ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటాన’ని అఖిలమ్మ సవాలు విసిరింది. ఫలితం ఎలాగుంటుందో ఏమో ఇప్పుడే ఎవరూ చెప్పలేరుగానీ టిడిపి మాత్రం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక సెంటిమెంటును మాత్రం బాగా పండిస్తోంది.

తెలుగుదేశంపార్టీ నంద్యాలలో వీల్ ఛైర్లో ఆశీర్వాద యాత్రను ప్రారంభించింది. త్వరలో జరుగనున్న ఉపఎన్నిక ప్రచారాన్ని భూమా కుంటుంబం శుక్రవారం ప్రారంభించిన ప్రచారానికి ‘ఆశీర్వాదయాత్ర’ అని పేరు పెట్టుకున్నది. పేరు బాగానే ఉంది కానీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఎస్పీవై రెడ్డిని ముందుకు పెట్టి యాత్రను ప్రారంభించటమే విచిత్రం. ఎందుకంటే, ఎప్పుడైతే ఎస్పీవై రెడ్డిని ప్రచారంలోకి దింపారో ఆయన వీల్ ఛైర్లోనే కూర్చుని ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

వీలైఛైర్లో ప్రచారం అంటే అర్ధం ఏంటి? ప్రచారంలో గట్టిగా తిరగ్గలిగిన వారు లేరనే కదా? అభ్యర్ధేమో ఎన్నికలకు కొత్త. నియోజకవర్గం మొత్తం కాదు కనీసం టిడిపి నేతలందరికీ కూడా పరిచయం ఉన్న నేతకాదు. ఇక, మంత్రి భూమా అఖిలప్రియ అంటారా తన నియోజకవర్గం ఆళ్ళగడ్డపైనే ఇప్పటికీ పట్టు సాధించలేక అవస్తలు పడుతున్నారు. ఇక, ఆమె నంద్యాలలో ఏం చేయగలరు? ఉన్న కొద్దిమంది భూమా నాగిరెడ్డి అనుచరులను కూడా దూరం చేసుకున్నారు.

దాంతో ఏం చేయాలో దిక్కుతోచక చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చంద్రబాబు ఆదేశాలమేరకే మంచంమీదున్న ఎస్పీవై రెడ్డి చివరకు ప్రచారంలోకి దిగారు. ఇది..టిడిపి పరిస్ధితి. ఇటువంటి పరిస్ధితిలోనే ‘టిడిపి అభ్యర్ధి ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటాన’ని అఖిలమ్మ సవాలు విసిరింది. ఫలితం ఎలాగుంటుందో ఏమో ఇప్పుడే ఎవరూ చెప్పలేరుగానీ టిడిపి మాత్రం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక సెంటిమెంటును మాత్రం బాగా పండిస్తోంది.