తన కుమారుడి పెళ్లి జరుగుతున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చి ఓటు వేశారు వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు. వివాహాన్ని మధ్యలోనే వదిలిపెట్టి ప్రత్యేక విమానంలో బయలుదేరి, చివరి నిమిషంలో ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆ ఓటే పార్టీ అభ్యర్థి విజయంలో కీలకంగా మారింది. 

ఓ వైపు కుమారుడి పెళ్లి. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్.. ఆ ఎమ్మెల్యేకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇటు తండ్రిగా కుమారుడి పెళ్లి క్రతువు నిర్వహించాలి. అటు బాధ్యత గల ఎమ్మెల్యేగా ఓటు వేయాలి. చివరికి ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యతనే నిర్వహించేందుకు ఆయన ముందుకెళ్లారు. కుమారుడి పెళ్లిని మధ్యలోనే వదిలిపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఒక్క ఓటుతోనే తన పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచారు. 

క‌రోనాతో త‌ల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల‌కు ప్ర‌భుత్వ‌ ఆర్థిక సాయం

తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహం నాలుగు నెలల కింద నిశ్చయం అయ్యింది. ఈ నెల 23వ తేదీ పెళ్లి ముహుర్తంగా నిర్ణయించుకున్నారు. కానీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇదే రోజున వచ్చాయి. దీంతో ఆయన అయోమయంలో పడ్డారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. ప్రముఖ నేతల స్థానాలపై క్లారిటీ..!

ఎంతో ఖర్చుపెట్టి కుమారుడి పెళ్లి వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహం కావడం, విజయనగరంలో ఆయన వైసీపీకి ముఖ్య నాయకుడు కావడంతో భారీగా జనాలు ఈ వివాహానికి హాజరయ్యారు. కానీ అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ పెళ్లికి సీఎం, ఇతర ఎమ్మెల్యేలు కూడా హాజరుకాలేకపోయారు. ఈ ఎన్నికలను వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. ఈ సమయంలో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకంగా మారింది. దీంతో తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనాలని వైసీపీ ఎమ్మెల్యే ఆదేశించింది. 

అమృత్‌పాల్ సింగ్ మామూలోడు కాదు.. వాడు ఏం చేశాడంటే.. ?

దీంతో పెళ్లి కార్యక్రమం జరుగుతుండగానే అక్కడ నుంచి ఎమ్మెల్యే బయలుదేరాడు. ఆయన ఓటు వేసేందుకు పార్టీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. రూ.10 లక్షలు ఖర్చు చేసి ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసింది. కానీ ఇదే సమయంలో విమానం గంట ఆలస్యం అయ్యింది. దీంతో పార్టీ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. అయితే ఎమ్మెల్యే రాక కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో ఆయన చివరి నిమిషంలో అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నంకు అప్పలనాయుడు ఓటేశారు. దీంతో ఏసురత్నం 22 మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇన్ని మలుపుల మధ్య ఎమ్మెల్యే వచ్చి ఓటు వేయడం, పార్టీ అభ్యర్థి విజయంలో ఆ ఓటే కీలకంగా మారడంతో ఇప్పుడు ఈ విషయం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.