అమరావతి:కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఏపీ సీఎంఓ అడిషనల్ సెక్రటరీ పీవీ రమేష్ కోరారు.

ఏపీ సీఎంఓ అడిషనల్ సెక్రటరీ పీవీ రమేష్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.13,894 మంది విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినట్టుగా చెప్పారు. 11 వేల 421 మంది ఇళ్లలోనే ఉన్నారన్నారు.53 మంది ఐసోలేషన్ లో ఉన్నారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 800 వెంటిలేటర్లను అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 200 వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రమేష్ చెప్పారు.విదేశాల నుండి వచ్చిన వారంతా అధికారులకు రిపోర్టు చేయాల్సిందిగా కోరారు.

also read:కరోనా ఎఫెక్ట్: ఏపీలో ఎంసెట్, ఈసెట్ ధరఖాస్తుకు గడువు పొడిగింపు

ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. లేదా సమీపంలోని అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. కరోనా నివారణకు ప్రభుత్వం 20 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటికే 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా చెప్పారు. విశాఖ జిల్లాలో 1470 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని పీవీ రమేష్ తెలిపారు.

విశాఖపట్టణంలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి రూరల్ హైరిస్క్ జోన్ లో ఉన్నాయన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 మంది రిపోర్టులు నెగిటివ్ గా వచ్చినట్టుగా ఆయన తెలిపారు.