Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఏపీలో ఎంసెట్, ఈసెట్ ధరఖాస్తుకు గడువు పొడిగింపు

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షలు రాసే అభ్యర్థులకు గడువును పెంచింది ఏపీ ప్రభుత్వం. ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులకు ఈ వెసులుబాటు కల్పించినట్టుగా చెప్పారు.

last date for Eamcet, E-cet registration extended in andhra pradesh
Author
Amaravathi, First Published Mar 24, 2020, 3:40 PM IST

అమరావతి: కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షలు రాసే అభ్యర్థులకు గడువును పెంచింది ఏపీ ప్రభుత్వం. ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులకు ఈ వెసులుబాటు కల్పించినట్టుగా చెప్పారు.

ఏపీ రాష్ట్రంలో ఈ నెల 29వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షల కోసం ధరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. అయితే కరోనా కారణంగా ఏప్రిల్ 5వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకొనే గడువును పెంచారు. ఈ సెట్ గడువును ఏప్రిల్ 2వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీకి పెంచారు. ఐసెట్ కు  కూడ ఏప్రిల్ 9వ తేదీ వరకు గడువును పెంచారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు

రాష్ట్రంలో ఇప్పటికే విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.మరో వైపు ఈ నెల 31వ తేదీ నుండి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయాలు తీసుకొంటుంది. విశాఖపట్టణంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios