ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కొడుకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చారు. ఈ మేరకు ఆయన కుమారుడు వీడియో రిలీజ్ చేశారు.

"

అందరం ఆరోగ్యంగానే ఉన్నాం.. అయితే నెలాఖరు వరకు ఎవ్వరూ పరామర్శలకు ఇంటికి రావద్దని.. ఇది కేవలం అందరి ఆరోగ్యం కోసమేనని విన్నపం చేశారు. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని.. నెలాఖరు వరకు అందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. 

కాగా మే 4వ వతేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ వారం రోజుల క్రితం శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు.  

నాలుగు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని కరోనా లక్షణాలతో అదే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వస్తు్నాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.