వైసీపీ మంత్రుల రాజీనామాల లేఖలు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చేరాయి. వైసీపీలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో నలుగురిని చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే కదా? మొత్తం ఎంఎల్ఏల రాజీనామాలకు వైసీపీ ఎప్పటి నుండో పట్టుబడుతోంది. ఎప్పుడైతే వారిలో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారో వెంటనే వారి రాజీనామాలకై వైసీపీ పెద్ద ఎత్తున ఒత్తిడి మొదలుపెట్టింది. దాంతో ఆ నలుగురు రాజీనామాలు చేసారంటూ ఉదయం నుండి ప్రభుత్వం లీకులను వదులుతోంది. అయితే, చివరకు స్పీకర్ ఆ నలుగురు రాజీనామాలు తనకు అందినట్లు బహిరంగంగా అంగీకరించారు. దాంతో రాజీనామలపై సస్పెన్స్ వీడిపోయింది.

ఇక, వారి రాజీనామాల బంతి స్పీకర్ కోర్టులో పడింది. ఎప్పటిలోగా వారితో స్పీకర్ మాట్లాడుతారో చూడాలి. ఎందుకంటే, రాజీనామా చేసిన సభ్యులతో స్పీకర్ నేరుగా మాట్లాడాలి. స్వచ్చంధంగా రాజీనామా చేసారా లేక ఒత్తిడితోనే రాజీనామా చేసారా అన్న విషయాన్ని స్పీకర్ నిర్ధారించుకుంటారు. ఈ ప్రక్రియ అయ్యేటప్పటికి ఎంత కాలం పడుతుందో చూడాలి.