Asianet News TeluguAsianet News Telugu

రోజాను టిడిపి వదిలేలా లేదు

  • రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా టిడిపి నిర్వహించిన మాక్ పోలింగ్ కు స్పీకర్ ఎలా హాజరవుతారంటూ రోజా నిలదీసారు.
  • పదవికి గౌరవం వచ్చేలా కోడెల వ్యవహరించాలంటూ సూచించారు.
  • స్ధాయితగ్గి స్పీకర్ పదవికే గౌరవం లేకుండా చేయటం అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు రోజా పేర్కొన్నారు.
Speaker orders assembly secretary to issue privilege notice to ycp mla roja

వైసీపీ ఎంఎల్ఏ రోజాను టిడిపి విడిచిపెట్టేలా లేదు. ఏదో ఓ విధంగా అవకాశం దొరికితే చాలు చర్యలు తీసుకునేందుకు కాచుకుని కూర్చున్నది. ఈరోజు జరిగిన పరిణామాలు దాన్నే సూచిస్తున్నది. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై రోజా చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపాయి. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా టిడిపి నిర్వహించిన మాక్ పోలింగ్ కు స్పీకర్ ఎలా హాజరవుతారంటూ రోజా నిలదీసారు. పదవికి గౌరవం వచ్చేలా కోడెల వ్యవహరించాలంటూ సూచించారు. స్ధాయితగ్గి స్పీకర్ పదవికే గౌరవం లేకుండా చేయటం అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు రోజా పేర్కొన్నారు. దాంతో వివాదం రాజుకుంది.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రోజాకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కోడెల ఆదేశించారు. దాంతో వివాదం మరింత పెద్దదైంది. క్యాబినెట్ సమావేశం సమావేశానికి వెళ్లి జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సును జయప్రదం చేయాలని సభ్యులకు విజ్ఞప్తి చేసి వచ్చేసారు. సమస్య అక్కడే మొదలైంది. సరే, తర్వాత కోడెల మీడియాతో మాట్లాడుతూ, తాను టిడిఎల్పీ కార్యాలయానికి వెళ్లలేదన్నారు. ఓటింగ్ ఎలా వేయాలో తన కార్యాలయం ఎదుటే తనకు సిఎం తదిరులకు అధికారులు వివరించినట్లు స్పీకర్ చెప్పారు. తాను స్పీకర్ స్ధానాన్ని కించపరిచేలా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. అయినా తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు రోజాకు నోటీసులు జారీ చేస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios