ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే..

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ కారణంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టుగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

south central railway runs special trains on diwali in telugu states

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ కారణంగా ప్రత్యేక రైళ్లను (Diwali Special Trains) నడపనున్నట్టుగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ రైళ్లను విశాఖపట్నం- సికింద్రాబాద్, విశాఖపట్నం- సికింద్రాబాద్‌ల మధ్య నడపనున్నట్టుగా తెలిపింది. ఇందుకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను రైల్వే ప్రారంభించింది.

విశాఖపట్నం- సికింద్రాబాద్‌‌ స్పెషల్ ట్రైన్ (నెం.08585) నవంబరు 2న (మంగళవారం) సాయంత్రం 5.35 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 07.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అదేవిధంగా సికింద్రాబాద్- విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ (నెం.08586) నవంబరు 3న(బుధవారం) రాత్రి 09.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి  గురువారం ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ రైల్వేస్టేషన్లలో ఆగనుంది. 

Also read: లఖింపుర్ కేసు.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి డెంగ్యూ.. ఆస్పత్రికి తరలింపు..

విశాఖపట్నం- తిరుపతి స్పెషల్ ట్రైన్ (నెం.08583) నవంబరు 1న(సోమవారం) సాయంత్రం 07.15 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 07.30 గం.లకు తిరుపతి చేరుకోనుంది. తిరుపతి- విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ (నెం.08584) తిరుపతి నుండి నవంబరు 2న(మంగళవారం) రాత్రి 09.55 గం.లకు బయలుదేరి బుధవారం ఉదయం 10.20 గం.లకు విశాఖపట్నం చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios