తాకట్టు పెట్టిన తన బంగారు నగలను విడిపించుకొస్తే కాపురానికి వస్తానని భార్య తేల్చి చెప్పింది. ఆ బంగారాన్ని విడిపించేందుకు నాగరాజు తన తల్లి బంగారాన్ని అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు రోకలిబండతో నరసమ్మ తల మీద బాది హతమార్చాడు.
కడప : ఓబులవారిపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. Gold jewelry కోసం తల్లిని కుమారుడు murder చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని శివశంకరాపురం గ్రామానికి చెందిన రామయ్య, నరసమ్మ (47) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు నాగరాజు liquorకి బానిసై నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. దీంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో భార్యను తిరిగి ఇంటికి రమ్మని కోరగా.. తాకట్టు పెట్టిన తన బంగారు నగలను విడిపించుకొస్తే కాపురానికి వస్తానని తేల్చి చెప్పింది. ఆ బంగారాన్ని విడిపించేందుకు నాగరాజు తన తల్లి బంగారాన్ని అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు రోకలిబండతో నరసమ్మ తల మీద బాది హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చిందో కసాయి కూతురు. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. సవతి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని.. అది తల్లికి తెలియడంతో అడ్డు తొలగించుకోవాలని.. అడ్డంగా నరికి చంపింది.
సవతి తండ్రితో ప్రేమాయణం.. 40 కోట్ల ఆస్తి దక్కదని.. తల్లిని కిరాతకంగా హత్య చేయించిన కూతురు..
ఈ కేసులో.. హత్యకు గురైన archana reddy కేసులో పోలీసులు ఆమె రెండో భర్తతో పాటు కుమార్తె సహా ఏడుగురిని గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 27న నగరానికి చెందిన అర్చనా రెడ్డి హోసూరు రోడ్డులో కారులో వస్తుండగా కొందరు అడ్డుకుని నరికి చంపారు. విచారణ చేసిన పోలీసులకు అర్చనారెడ్డిని murderకు ఆమె రెండో భర్త నవీన్ తో పాటు ఆమె కుమార్తె యువికారెడ్డి (21) కుట్ర పన్నినట్లు తేలింది.
నవీన్ రూ.40కోట్ల propertiesలు చేయిజారి పోయే ప్రమాదం ఉందని యువికారెడ్డికి చెప్పాడు. దీంతో ఆమెను హత్య చేయడానికి సతీశ్ తో పాటు మరికొంతమందిని ఏర్పాటు చేశారు. ఈనెల 27న జిగిని పురసభ ఎన్నికల్లో ఓటు వేసి కారులో వస్తుండగా అతి దారుణంగా నరికి చంపారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
కాగా, బికామ్ చివరి సంవత్సరం విద్యార్థిని అయిన యువికా రెడ్డి అప్పటికే తన తల్లితో విడిగా ఉంటోంది. సవతి తండ్రితో ప్రేమలో పడడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ మేరకు అర్చనా రెడ్డి ఈ నవంబర్ చివరి వారంలో భారతీయ శిక్షాస్మృతి 498A కింద రెండవ భర్త, జిమ్ ట్రైనర్ అయిన నవీన్ కుమార్ (33) మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
దీంతో కోపోద్రిక్తులైన యువిక, లవర్ గా మారి తన సవతి తండ్రి నవీన్‌తో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో అర్చన అడ్డు తొలగించాలని యువికారెడ్డి నిర్ణయించుకుంది. దీనికోసం సవతి తండ్రి కమ్ లవర్ తో కలిసి ప్లాన్ చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
