అత్త డబ్బుల మీద అల్లుడి కన్ను.. ‘భార్యను చంపేశా, మిగతా కూతుళ్లను చంపేస్తా’ అంటూ బెదిరింపులు...

 రైల్వే ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పేరు రాములు భార్య అయిన నరసమ్మ కు రూ. 30 లక్షల నగదు వచ్చింది. ఆ నగదును ఎలాగైనా కాజేయాలని ప్రేమ వివాహం చేసుకున్న నాల్గవ కుమార్తె పేరం వరలక్ష్మి భర్తైన కామినేని ప్రశాంత్ కుమార్ పన్నాగం పన్నాడు.  ఇల్లు కొనిస్తానంటూ నరసమ్మ వద్ద  రూ. 30 లక్షల నగదు,  మిగిలిన నలుగురు కుమార్తెల దగ్గర ఐదు లక్షలు తీసుకొని..  భార్యతో కలిసి  ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.  

son-in-law threatens mother-in-law for money in guntur

గుంటూరు జిల్లా : డబ్బుకోసం ఓ అల్లుడు ఘాతుకానికి తెగబడ్డాడు. అత్తను నమ్మించి మోసం చేయడమే కాకుండా... ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను కడతేర్చాడు. అంతేకాకుండా అత్తను చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జరిగింది. 

ప్రేమ వివాహం చేసుకున్న భార్యను చంపేశానని ఫోన్ చేసి బెదిరించిన అల్లుడిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదయింది.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లి పట్టణ పరిధిలోని యాదవుల బజార్ లో నివాసముండే పేరం రాములు, పేరం నర్సమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు.  తండ్రి చనిపోయాడు. ఐదుగురు కూతుళ్లు వివాహాలు చేసుకుని ఎవరికి వారు బతుకుతున్నారు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పేరు రాములు భార్య అయిన నరసమ్మ కు రూ. 30 లక్షల నగదు వచ్చింది.

ఆ నగదును ఎలాగైనా కాజేయాలని ప్రేమ వివాహం చేసుకున్న నాల్గవ కుమార్తె పేరం వరలక్ష్మి భర్తైన కామినేని ప్రశాంత్ కుమార్ పన్నాగం పన్నాడు.  ఇల్లు కొనిస్తానంటూ నరసమ్మ వద్ద  రూ. 30 లక్షల నగదు,  మిగిలిన నలుగురు కుమార్తెల దగ్గర ఐదు లక్షలు తీసుకొని..  భార్యతో కలిసి  ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.  ఆ తరువాత ప్రశాంత్ కుమార్ అతని భార్య ఫోను స్విచ్ఛాఫ్ చేశారు.

దీంతో అత్తకు అనుమానం వచ్చి గన్నవరంలోని  అల్లుడు కామినేని ప్రశాంత్ కుమార్  ఇంటికి వెళ్ళింది. అక్కడ ప్రశాంత్ కుమార్ తల్లిదండ్రులు మాకు తెలియదని చెప్పారు.  ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అల్లుడు అత్త నరసమ్మకు  ఫోన్ చేశాడు. నీ కూతుర్ని చంపి పూడ్చి పెట్టాను. ఈ విషయాన్ని బయటకు చెబితే మిగతా నలుగురు కూతుళ్లను, నిన్ను చంపుతాను అని బెదిరించి ఫోన్ స్విచాఫ్ చేశాడు. 

దీంతో భయాందోళనల్లో పడ్డ నరసమ్మ తనను, తన కూతుళ్ళను రక్షించాలంటూ  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ కుమార్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios