ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర పాలనను మర్చిపోయారని విమర్శించారు. ఇక్కడ పరిపాలన మానేసి దేశ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుమారులకు పదువులను కట్టబెట్టేందుకే...బీజేపీయేతర పార్టీలన్నీ ఒక గొడుగు కిందకి వస్తున్నాయన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలని, లోకేష్, స్టాలిన్ లు సీఎంలు అయిపోవాలని పగటి కలలు కంటున్నారన్నారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ యేతర పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును గృహ నిర్భంధం చేసి బీజేపీ నేతలపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.  అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతున్నాయన్నారు. టీడీపీ పాలన మొత్తం అవినీతి మయమైందన్నారు. అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయాలను దోపీడీ చేశారని ఆరోపించారు.