విజయవాడ: ఏపిలో ఇటీవల దేవాలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు, ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హిందువులు మనోభావాలు  దెబ్బతీస్తున్నాయని ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. అంతర్వేది ఘటన, మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బిజెపి పోరాటం చేస్తుందని...వీటిపై సమావేశంలో చర్చించి పెద్దలు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారన్నారు. 

''మక్కా, జెరూ సలేం కు డబ్బులు ఇచ్చి పంపినా వారికి మతతత్వం లేదు. హిందూ ఆలయాలపై దాడులను ఖండిస్తే మనం మతతత్వ వాదులం. ఎన్ని ఘటనలు జరిగినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? వీటన్నింటిపైనా చర్చించి మన పోరారాన్ని కొనసాగిద్దాం'' అని బిజెపి నాయకులకు సూచించారు. 

''ఏపిలో వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసి వైసిపి కార్యకర్తలను నియమించుకుంది. కానీ మనకు మన కార్యకర్తలే బలం. వారి ద్వారా కేంద్ర పధకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందరినీ కలుపుకుని నాయకులు, కార్యకర్తల సమూహంతో ముందుకు  వెళ్లాలి. గ్రామ, మండల కమిటీలు వేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలి. ఈరోజు సమావేశం లో పాల్గొన్న వారంతా తమ తమ అభిప్రాయాలు వెల్లడించాలి'' అని వీర్రాజు సూచించారు. 

read more  తప్పేమీ లేదు, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి కొడాలి నాని

''బిజెపి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఎపిలో పని చేస్తుంది. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో పాటు, అభివృద్ధి లక్ష్యంగా మనం పని చేస్తున్నాం. వాజపేయ్ ఆధ్వర్యంలో సమృద్ భారత్ పేరుతో అభివృద్ధి చేశారు. మనం సమృద్ ఆంధ్రా పేరుతో ముందుకు సాగుతాం'' అని అన్నారు

''ఎపిలో రాజకీయాలు  కుటుంబాల చుట్టూనే తిరుగుతాయి. అనేక రకాల కోణాల్లో ఎపి అభివృద్ధి చెందాలనేదే బిజెపి ఆలోచన. సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశంలోనే ఆదర్శంగా ఉండేలా ఎపిని తయారు చేస్తాం. వికసిత వికాస్ పేరుతో... వికసించే ఆంధ్రాగా తీర్చిదిద్దేలా ఈ పదాధికారుల సమావేశం స్వీకరిస్తుంది. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు ఉండాలి'' అని సోము వీర్రాజు పేర్కొన్నారు.