Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాలు క్రికెట్ ఆటలాంటివే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాజకీయాలు క్రికెట్ ఆటలాంటివేనని ఆయన వ్యాఖ్యానించారు. 

somu veerraju reacts on bjp lost in mlc election
Author
First Published Mar 21, 2023, 2:34 PM IST

రాజకీయాలు క్రికెట్ ఆటలాంటివేనన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గెలుపు ఓటములు కామనే అన్న ఆయన.. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి గెలుస్తామని అన్ని సందర్భాలను స్వాగతించాలని వీర్రాజు పిలుపునిచ్చారు. విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ పదాదికారుల సమావేశంలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి, ఇన్‌ఫ్లూయెన్స్ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వంతో వ్యతిరేకత , మోడీకి వున్న ఆదరణ కనిపించిందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేసిన కార్యకర్తలను సోము వీర్రాజు అభినందించారు. 

ALso Read: అంకెల గారడీ: ఏపీ బడ్జెట్ 2023 పై సోము వీర్రాజు

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను అధ్యక్షుడు సోము వీర్రాజు సీరియస్‌గా తీసుకోలేదని, జనసేనతో పొత్తులో వున్నప్పటికీ అటు నుంచి స్పష్టమైన ప్రకటన తెప్పించుకోలేకపోయారని కాషాయ నేతలు గుసగసలాడుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios