ఏపీ బడ్జెట్  పై  బీజేపీ  నేతలు  విమర్శలుగ గుప్పించారు.  బడ్జెట్ ను  అంకెల గారడీని సోము వీర్రాజు విమర్శించారు.  


అమరావతి: బడ్జెట్ పై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు వేశారు. 
అప్పులను ఆదాయంగా చూపారన్నారు. 

గురువారంనాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పులను ఆదాయంగా చూపారన్నారు. అప్పులను ఆదాయంగా చూపకూడదని ఆర్ బీఐ సూచనలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఆర్ధిక మంత్రి అంకెల గారడీతో మాయ చేశారని ఆయన విమర్శించారు.రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలను చెప్పారన్నారు.

 2 లక్షల 79 వేల 279 ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రెవిన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు,మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు,ద్రవ్య లోటు రూ.54,587 కోట్లుజీఎస్‌డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది