విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిని సోము వీర్రాజు ఇందిరాగాంధీ అవకాశం ఇస్తే ఎన్టీఆర్ పై పోటీచేస్తానని చెప్పింది నిజం కాదా అని నిలదీశారు. 

ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం పెట్టి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్మీపార్వతికి డోరు తీసి వాహనం ఎక్కించిన అనైతిక నేత చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ దగ్గరకు లక్ష్మీపార్వతిని తీసుకువచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా వచ్చిందో తెలియాలో ఇన్విస్టిగేషన్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్మీపార్వతిని చూపించి నందమూరి ఫ్యామిలీని విడగొట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపించారు. ఫ్యామిలీని తనవైపుకు తిప్పుకుని ఎన్టీఆర్ ను గద్దె దింపాడని ఆరోపించారు.

1995 నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు. రోజుకో మాట మాట్లాడే చంద్రబాబు నాయుడికి సిగ్గుందా అంటూ ఘాటు విమర్శలు చేశారు సోము వీర్రాజు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ దమ్మున్న నేత, చంద్రబాబు చేతకాని వాడు: సోము వీర్రాజు