ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన అంశంపై ఏపీ బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. ఒక్కో నేత ఒక్కో రకంగా మాట్లాడుతుండటంతో ఆ పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు.

అమరావతిగా రాజధానిగా ఉండాలంటూనే కేంద్రం జోక్యంపై బీజేపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజధాని విషయంలో కేంద్రానికి కలగజేసుకునే అధికారం వుందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అయితే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

Also Read:దెబ్బ మీద దెబ్బ కొట్టాడు: చంద్రబాబుపై సోము వీర్రాజు సంచలనం

రాజధాని వికేంద్రీకరణ బదులు పాలన వికేంద్రీకరణ జరగాలని.. ప్రభుత్వం గవర్నర్ వద్దకు తీసుకెళ్లిందని సుజనా అన్నారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5, 6కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని ప్రభుత్వం గవర్నర్ వద్దకు తీసుకెళ్లిందని ఆయన గుర్తుచేశారు.

గవర్నర్ న్యాయ సమీక్షకు పంపకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోరని సుజనా చెప్పారు. అసలు రాజధాని మార్పు ఫైల్ ఎక్కడ ఉందో అర్ధం కాని పరిస్థితన్నారు. కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకుంటుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

Also Read:సోము వీర్రాజు నియామకం: చంద్రబాబు టార్గెట్, పవన్ కల్యాణ్ తురుపు ముక్క

ఇకపోతే సోము వీర్రాజు మాట్లాడుతూ.. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని వీర్రాజు స్పష్టం చేశారు.