సోము వీర్రాజు నియామకం: చంద్రబాబు టార్గెట్, పవన్ కల్యాణ్ తురుపు ముక్క

First Published 30, Jul 2020, 3:55 PM

సోము వీర్రాజుకి పదవిని అప్పగించడం ద్వారా టీడీపీని బలహీనపరచాలనే ప్లాన్ అయితే ఎప్పటినుండో ఉంది. దాన్ని బహుశా ఇప్పుడు ఇంకాస్త బలంగా అవలంబిస్తారేమో.వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేని టీడీపీ నాయకులూ వచ్చి బీజేపీలో చేరుతారనేది వీరి స్కెచ్.

ఆంధ్రప్రదేశ్ లో సోము వీర్రాజుని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా ఉంది. సోము వీర్రాజు నియామకాన్ని ఆయన అనుచరుల కన్నా అధికార వైసీపీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంది. చాలాచోట్ల బాణాసంచా కాల్చి కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

సోము వీర్రాజు బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటినుండి మీడియాలో రాకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇక ఒక వర్గం మీడియా అయితే కన్నా ను తొలిగించి సోము వీర్రాజుకి పదవి ఇచ్చారు అని కూడా అంటున్నారు. కన్నాను తొలిగింపు అనేది ఇక్కడ లేదు. బీజేపీలో రాష్ట్రం నుంచి కేంద్రం వరకు అన్ని అధ్యక్ష పదవులు మార్పు సమయానుకూలంగా జరుగుతూనే ఉంటుంది.

జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను నియమించారంటే అమిత్ షా ని తొలిగించినట్టు కాదు కదా! అదే ఇక్కడ కూడా, తెలంగాణతోపాటుగా ఏపీలోనూ అధ్యక్షమార్పు జరిగింది అంతే. సోము వీర్రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన సైతం కన్నా తరువాత అధ్యక్ష పదవిని చేపట్టారు తప్ప ఇంకొకటి కాదు.

ఇక వైసీపీ వర్గాలు అధికంగా ఆనంద పడడానికి కారణాలు ముఖ్యంగా రెండు. మొదటగా వైసీపీకి వ్యతిరేకంగా కన్నా బలమైన స్టాండ్ తీసుకున్నారు. అమరావతి ఇష్యూ నుంచి మొదలుకొని ఇంగ్లీష్ మీడియం వరకు అన్ని అంశాల్లోనూ జగన్ ని వ్యతిరేకించాడు.

ఇక రెండవ అంశం... ఆయన మీద పదే పదే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణను వైసీపీ చేయడం. వైసీపీ వారు ఆయనను పదే పదే చంద్రబ్బుకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బహుశా జగన్ ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా ఉండడం వల్ల ఈ విధంగా అనిపించి ఉండవచ్చు.

ఈ కారణాల వల్ల ఆయనను పదే పదే వైసీపీ నేతలు టార్గెట్ చేసేవారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డిని కన్నాపై చేయని విమర్శ లేదంటే అతిశయోక్తి కాదు. ఇక సోము వీర్రాజు విషయానికి వస్తే ఆయన స్వతహాగా దూకుడు ఉన్న వ్యక్తి. గత సారే ఆయన అధ్యక్ష పదవిని చేబడుతారని అంతా భావించినప్పటికీ... కన్నా లక్ష్మీనారాయణకు ఆ పదవిని అప్పగించారు.

ఇప్పుడు ఇక సోమువీర్రాజుకి అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంతో పార్టీలో నూతన జోష్ వచ్చినట్టుగా కనబడుతుంది. ఆయన టీడీపీకి బద్ద వ్యతిరేకి అనేది అందరూ అనుకునే మాట. తూర్పు గోదావరి జిల్లా కాపు సామాజికవర్గానికి చెందిన నేత సోమువీర్రాజు.

ఆయనను అధ్యక్ష పదవిలో కూర్చో బెట్టడం, పవన్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపు సామాజికవర్గానికి బీజేపీ గాలం వేస్తుందనేది తథ్యం. కాపులను తమవైపుగా తిప్పుకోవాలనేది ఎప్పటినుండో బీజేపీ ప్లాన్. గతంలో కన్నాను ఈ పదవిలో కొర్చోబెట్టింది కూడా అందుకే.

ఇప్పుడు సోము వీర్రాజుకి పదవిని అప్పగించడం ద్వారా టీడీపీని బలహీనపరచాలనే ప్లాన్ అయితే ఎప్పటినుండో ఉంది. దాన్ని బహుశా ఇప్పుడు ఇంకాస్త బలంగా అవలంబిస్తారేమో.వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేని టీడీపీ నాయకులూ వచ్చి బీజేపీలో చేరుతారనేది వీరి స్కెచ్.

ఏదో తొలుత రాజ్యసభ ఎంపీలు కొందరు చేరినా, మిగిలినవారు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బీజేపీ కన్నా వైసీపీలో చేరడానికే మొగ్గు చూపెడుతున్నారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాం, సిద్ద రాఘవరావు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

ఇంకో ఇద్దరు ముగ్గురు టీడీపీ నేతలకు కూడా వైసీపీ గాలం వేస్తున్నట్టుగా కనబడుతుంది. టీడీపీ ప్లేస్ లో ప్రతిపక్ష పార్టీగా అవతరించాలనేది బీజేపీ వ్యూహం. టీడీపీ ఖాళీ అయి బీజేపీలో చేరతారని వారు భావించారు. కానీ ఇక్కడ టీడీపీ వారంతా వైసీపీలోనే చేరుతున్నారు.

ఏది ఏమైనా కాపు రాజకీయాన్ని మాత్రం బీజేపీ ఇకమీదట జనసేనతో కలిసి బలంగా చేయబోతుందనేది అక్షర సత్యం. అందుకోసమే మరోసారి కాపునేతను పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది. ఇక కొత్త కమలదళాధిపతి ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి..!

loader