తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన సోమిరెడ్డి, కాకానిపైనే  రివర్స్ బ్లాక్ మైలింగ్ కు దిగటమే నేటి రాజకీయం.

నెల్లూరు జిల్లా టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భలే బ్లాక్ మైలింగ్ కు దిగారు. సోమిరెడ్డి అవినీతిపై ఇటీవలే వైసీపీ ఎంఎల్ఏ కాకాని గోవర్ధనరెడ్డి పలు ఆరోపణలు చేసారు. దానికి సమాధానంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, తన అవినీతి విషయమై నిగ్గు తేల్చేందుకు కాకానే తనపై పోలీసు కేసు పెట్టాలట.

ఎలాగుంది సోమిరెడ్డి డిమాండ్. భలేగుందికదూ. ఆరోపణలు చేయటం ప్రతిపక్షాల పని. ఆరోపణలు తప్పని నిరూపించుకోవటం అధికారంలోని వారి బాధ్యత. అంతేకానీ సోమిరెడ్డి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు చేసిన వారే ఎక్కడా కేసులు పెట్టారు.

ఎందుకంటే, ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ నేతలపై కేసులు పెట్టే దమ్ము పోలీసులకుందా? ఆ విషయం తెలీని అమాయకులెవరైనా ఉన్నారా? అది తెలిసే సోమిరెడ్డి తనపై కేసు పెట్టమని కాకానిని ఒత్తిడి తెస్తున్నారు. 24 గంటల్లో కాకాని తనపై కేసు పెట్టకపోతే తానే కాకానిపై ఆ పనిచేస్తానంటూ బ్లాక్ మైల్ కు దిగటం విచిత్రంగా ఉంది.

అధికార పార్టీ నేత, అందులోనూ ఎంఎల్సీ కాబట్టి కాకాని పై సోమిరెడ్డి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎటువంటి కేసైనా నమోదు చేస్తారనటంలో ఎవరికీ సందేహం లేదు.

కాకాని చేసిన ఆరోపణలపై సమాధానాలు ఇచ్చుకోవటానికి సోమిరెడ్డి నానా అవస్తలు పడుతున్నారన్నది స్పష్టం. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధాలిచ్చేటపుడు సోమిరెడ్డి మొహంలో నెత్తురుచుక్క లేదు. అదేవిధంగా గొంతులో తడబాటు స్పష్టంగా తెలుస్తోంది.

తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన సోమిరెడ్డి, కాకానిపైనే రివర్స్ బ్లాక్ మైలింగ్ కు దిగటమే నేటి రాజకీయం.