జైల్లో పెట్టి నాల్గు తగిలిస్తే..: రమణదీక్షితులుపై సోమిరెడ్డి సంచలనం

First Published 26, May 2018, 4:24 PM IST
Somireddy makes controversial comments on Ramandeekshitulu
Highlights

తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రమణదీక్షితులును జైల్లో నాలుగు తగిలిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు.

వెంకటేశ్వస్వామితో ఆడుకుంటారా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో రమణదీక్షితులును ప్రస్నించారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని గౌరవంగా చూసే సంప్రదాయం మనదని,  రమణదీక్షితులును జైల్లో పెడితే వాస్తవాలు బయటకి వస్తాయని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు 

రాజకీయ కుట్రలకు శ్రీవారిని పావుగా వాడుకుంటున్నారని ఆయన విమ్రశించారు విమర్శించారు. బీజేపీ, వైసీపీ నాయకుల ఉపయోగించే భాష బాగాలేదని సోమిరెడ్డి మండిపడ్డారు. వైసిపి, బిజెపి నాయకులు నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు.

దివంగత నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామనిచంద్రమోహన్ రెడ్డి అన్నారు.
 

loader