Asianet News TeluguAsianet News Telugu

ఆనందయ్య మందు తీసుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట... ఏమన్నారంటే: సోమిరెడ్డి (వీడియో)

పేదలకు మాత్రం మందు పంపిణీ ఆపేసి పెద్దోళ్లకు మాత్రం సివిఆర్ ఫౌండేషన్ లో తయారుచేసిన మందు దొంగచాటున బక్కెట్లకు బక్కెట్లు పంపిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. 

somireddy chandramohan reddy on anandaiah corona medicine akp
Author
Nellore, First Published May 27, 2021, 4:15 PM IST

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదలకు మాత్రం మందు పంపిణీ ఆపేసి పెద్దోళ్లకు మాత్రం సివిఆర్ ఫౌండేషన్ లో తయారుచేసిన మందు దొంగచాటున బక్కెట్లకు బక్కెట్లు పంపిస్తున్నారు... ఇదెక్కడి న్యాయం అని వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి.

''ఎంతో సౌమ్యుడైన ఆనందయ్య తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ 40 ఏళ్లుగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ కు సంబంధించి కూడా 70 వేల మంది ఆయనిచ్చే మందు తీసుకున్నారు... ఏ ఒక్కరూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు. ఇప్పుడే కాదు 40 ఏళ్లలో ఎప్పుడూ ఆనందయ్య మందు గురించి ఒక్క ఫిర్యాదు కూడా లేదు'' అని సోమిరెడ్డి పేర్కొన్నారు. 

''ఆనందయ్య మందు తీసుకున్నానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మందుపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు. ఒంగోలు వాసులందరూ కూడా ఆ మందు కోరుకుంటున్నారని వెల్లడించారు'' అని తెలిపారు. 

వీడియో

''ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు'' అని సోమిరెడ్డి తెలిపారు.

read more  ప్రజలు వేచిచూస్తున్నారు... ఆనందయ్య మందుపై త్వరగా తేల్చండి:హైకోర్టు

''పేదలకు ఉచితంగా సేవ చేస్తున్న బీసీ వర్గానికి సంబంధించిన ఆనందయ్యను అనధికారికంగా నిర్బంధించడం బాధాకరం. ఆనందయ్య అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇలా నిర్బంధించగలిగే వారా..? ఆయనను నిర్బంధించడం న్యాయం కాదు...వెంటనే ఆయనకు స్వేచ్ఛ కల్పించాలి'' అని డిమాండ్ చేశారు.

''ఇక ఆనందయ్య మందు పంపిణీ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు క్షమించరు. మందుపై అనుమానం ఉన్నవాళ్లు దానిని వాడవద్దు. కానీ మందు పంపిణీని అడ్డుకోవాలని చూడొద్దు. ఆనందయ్యను ఎప్పటిలాగే స్వేచ్చగా మందు తయారుచేసి ప్రజలకు అందించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'' అని సోమిరెడ్డి పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios