Asianet News TeluguAsianet News Telugu

ప్రజలు వేచిచూస్తున్నారు... ఆనందయ్య మందుపై త్వరగా తేల్చండి:హైకోర్టు

ఆనందయ్య కరోనాకు మందు అందిస్తుంటే ప్రభుత్వం నిలిపివేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ చేపట్టింది.  

AP High Court Inquiry on Anandaiah Corona Medicine petition akp
Author
Amaravathi, First Published May 27, 2021, 1:12 PM IST

అమరావతి: ప్రజలు కరోనా రోగులకు ఆనందయ్య అందించే మందుకోసం ఎదురు చూస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. వారి కోరికను మన్నించి వీలైనంత త్వరగా ఈ మందుపై పరిశోదనలు జరిపి రిపోర్టులను వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. 

ఆనందయ్య కరోనాకు మందు అందిస్తుంటే ప్రభుత్వం నిలిపివేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తన వాదనను వినిపిస్తూ... ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని తెలిపారు. ఇప్పటికే ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామని... ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని ప్రభుత్వంహైకోర్టుకు తెలిపింది. 

read more  ఆనందయ్య మందు: సీసీఆర్ఏఎస్‌కి చేరిన డేటా, చేప మందు తరహలో అవకాశమిస్తారా?

పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య వాదిస్తూ... మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా  ఆదేశాలు ఇస్తుందన్నారు. ఆనందయ్య తో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారన్నారు మరో పిటిషనర్ న్యాయవాది బాలాజీ. తన మందును ప్రభుత్వం గుర్తించాలన్న ఆనందయ్య పిటిషన్ పై వాదనలు వినిపించారు న్యాయవాది అశ్వని కుమార్.

ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో తెలియజేయలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం  తెలిపింది. అయితే ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవు కదా? అని కోర్టు ప్రశ్నించగా లిఖిత పూర్వకంగా ఇది ఇంకా స్పష్టం కాలేదని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios