తెలుగుదేశం పార్టీ ఎంపీ కె. రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, జూనియర్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో సమాధానమిస్తూ.. ప్రధాన ట్యాంక్ రీఫిల్ చేయడం, ఆసుపత్రి బ్యాకప్‌కు మారడం మధ్య గ్యాప్ లో "కొంతమంది రోగులు" మరణించారని రాష్ట్ర ప్రభుత్వ డేటా సూచించిందని తెలిపారు.
న్యూఢిల్లీ : దేశాన్ని వణికించిన కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఆసుపత్రిలో "తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం" తో కొంతమంది మరణించారని కేంద్రం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది.
తెలుగుదేశం పార్టీ ఎంపీ కె. రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, జూనియర్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో సమాధానమిస్తూ.. ప్రధాన ట్యాంక్ రీఫిల్ చేయడం, ఆసుపత్రి బ్యాకప్‌కు మారడం మధ్య గ్యాప్ లో "కొంతమంది రోగులు" మరణించారని రాష్ట్ర ప్రభుత్వ డేటా సూచించిందని తెలిపారు.
"ప్రాథమిక నివేదిక ప్రకారం, 10కెఎల్ ఆక్సిజన్ ట్యాంక్‌ను లెవలింగ్ చేయడం, హాస్పిటల్ బ్యాకప్ మానిఫోల్డ్ సిస్టమ్‌ని ఆన్ చేయడం వలన ఆక్సిజన్ పైప్ లైన్లలో ఒత్తిడి తగ్గుతుంది" అని డాక్టర్ పవార్ చెప్పారు.
"ఆక్సిజన్ లైన్లలో ఒత్తిడి తగ్గడం వలన రోగులకు ముఖ్యంగా.. వెంటిలేటర్ సపోర్ట్ మీద తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండదు" అని ఆమె చెప్పుకొచ్చారు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా హాస్పిటల్‌లో మరణాలు సంభవించాయని, జూనియర్ హెల్త్ మినిస్టర్ కూడా చెప్పారు, అయితే అవి ఎప్పుడు జరిగాయనేది ఆమె పేర్కొనలేదు.
అయితే, మేలో - కోవిడ్ సెకండ్ వేవ్.. తీవ్రంగా ఉన్నప్పుడు... ఆసుపత్రుల్లో బెడ్స్, మందులు దొరకక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. SVRR ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా దెబ్బతినడంతో 11 మంది మరణించారు. ఆస్పత్రిలోని వార్డుల్లో సిబ్బంది పేషంట్ల ప్రాణాలు కాపాడడానికి చేసిన ప్రయత్నాల వీడియోలు చాలా ఈ సమయంలో బైటికి వచ్చాయి. ఆందోళన కలిగించాయి.
సంఘటన జరిగిన సమయంలో ఆక్సిజన్ సరఫరాకు దాదాపు 45 నిమిషాల పాటు అంతరాయం కలిగిందని రోగుల కుటుంబాలు ఆరోపించాయి. కానీ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణ మాత్రం "ఆక్సిజన్ సిలిండర్‌ను రీలోడ్ చేసే సమయంలో ఐదు నిమిషాల పాటు మాత్రమే అంతరాయం కలిగిందని.. అదే ఇది మరణాలకు దారితీసింది’ అని తెలిపారు.
COVID-19 సెకండ్ వేవ్ లో మరణాలు సంభవించలేదు అని డాక్టర్ పవార్ రాజ్యసభలో అన్నారు. "ఆక్సిజన్ కొరతతో కోవిడ్ మరణాలు సంభవించలేదు" అని గతనెలలో మాట్లాడడం పెద్ద దుమారం రేపింది. ఈ ప్రకటనతో అనేక నిరసనలు వెల్లువెత్తాయి.
ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సమాచారాన్ని ఊటంకించారు. ఆక్సీజన్ కొరత గురించి, ఆక్సీజన్ కోసం సాయం చేయమంటూ వచ్చిన అభ్యర్థనలను చూపించారు.
"ఆక్సిజన్ సంక్షోభం కారణంగా ఎవరూ మరణించలేదని చెప్పడం పూర్తిగా అబద్ధం. ఆసుపత్రులు ప్రతిరోజూ హైకోర్టులో నిరాశాజనకమైన అప్పీళ్లు ఎందుకు చేస్తున్నాయి?" అంటూ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ విమర్శలు గుప్పించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించిన వారి డేటాను సమర్పించాలని ఆదేశించడం ద్వారా కేంద్రం స్పందించింది. సమాచారాన్ని సేకరించి, పార్లమెంటుకు అందజేస్తామని కేంద్రం తెలిపింది.
ఆక్సిజన్ సరఫరా సంబంధిత మరణాలను నమోదు చేసిన రెండు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మరొకటి పంజాబ్. అక్కడి మరణాల్లో నాలుగు ఆక్సీజన్ లేకపోవడం వల్లే సంభవించాయని అనుమానిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పరువుహత్య... కన్న కూతురిని హతమార్చిన కసాయి తల్లిదండ్రులు?
మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో కొరత అనేది సెకండ్ వేవ్ లో అత్యంత దారుణమైన పరిస్థితి. వ్యక్తులు, ఆసుపత్రులు ఆక్సీజన్ సరఫరా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకోవడం, కోర్టులను ఆశ్రయించడం చూశాం. ఢిల్లీలో, ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించిన 12 మందిలో ఒక డాక్టర్ కూడా ఉన్నారు. మరో ఆసుపత్రిలో 25 మంది మరణించారు. గోవాలో 80 మందికి పైగా ప్రభుత్వ వైద్యశాలలో మరణించారు.
ఆక్సీజన్ 'సరఫరా లేకపోవడం' అనేది రవాణా పరంగా తలెత్తిన సమస్యనే కానీ.. ఉత్పత్తి పరంగా తలెత్తింది కాదని కేంద్రం నొక్కిచెప్పింది. ఆక్సీజన్ ఉత్పత్తి చేసిన ప్రదేశం నుండి అవసరమైన చోటికి తరలించడంలో నెలకొన్న సమస్యల వల్లే ఈ మరణాలు సంభవించాయని తెలిపింది.
అయితే, వీటన్నింటి కారణంగా ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడానికి, కొత్తగా ప్లాంట్ లు ఏర్పాటు చేయడానికి, అత్యవసర సదుపాయాల ఏర్పాటులో భాగంగా ఇతర దేశాల సహాయం కోరడానికి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఈ కారణాలు సరిపోతాయి.
