ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చూడనంతటి ఘోర పరాజయాన్ని టీడీపీ మూటకట్టుకుంది.

ముఖ్యంగా 23 స్థానాలే మిగలడంతో నెటిజన్లు చంద్రబాబుపై సెటైర్లు వదులుతున్నారు. అడ్డ దారిలో 23 మందిని కొన్నావు.. ఈ ఎన్నికల్లో 23 మంది గెలిచారు... చివరికి కౌంటింగ్ తేదీ కూడా 23 అవ్వడం దురదృష్ఖకరమన్నారు.

మరికొందరైతే మే 23న కాకుండా ఈ నెల 31న జరిగితేప బాగుండేదని.. కనీసం చంద్రబాబుకు 31 సీట్లు వచ్చేవని సానుభూతి చూపిస్తున్నారు.