వాకింగ్, యోగా చేసిన చంద్రబాబు: కుటుంబసభ్యులతో నేడు ములాఖత్
టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేశారు. చంద్రబాబును ఈ రోజు నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కలిసే అవకాశం ఉంది.

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రి కేంద్ర కారాగారంలో వాకింగ్, యోగా చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్ లో ఆయన వాకింగ్, యోగా చేశారు. ఆ తర్వాత ఆయన వార్తాపత్రికలు చదివారు. సోమవారం రాత్రి ఆయన త్వరగా నిద్రపోయారు. సహాయకుడు ఆయనకు అల్పాహారం అందించనున్నాడు.
కుటుంబసభ్యులతో చంద్రబాబుకు మంగళవారం ములాఖత్ ఉండే అవకాశం ఉంది. సోమవారం నాడే నారా లోకేష్,బ్రాహ్మణి, భువనేశ్వరి చంద్రబాబును కలవాల్సి ఉండింది. అయితే, చంద్రబాబుతో వారి ములాఖత్ సోమవారంనాడు జరగలేదు. చంద్రబాబును ముగ్గురు కలిసే అవకాశం ఉంటుంది. ములాఖత్ కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వారు చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. రాజమండ్రి జైలుకు కిలోమీటరు దూరంలో టిడిపి క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులోనే నారా లోకేష్ ఉంటున్నారు. మధ్యాహ్నం భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రి చేరుకుంటారు.
చంద్రబాబు హౌస్ రిమాండ్ మీద మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది. వాదనలు సోమవారం ముగిశాయి.
జైలులోని స్నేహ బ్లాక్ లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించిన విషయం తెలిసిందే. స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. ఆయనకు సహాయంగా ఓ వ్యక్తిని అనుమతించారు. ఐదుగురు సిబ్బందితో భద్రత కల్పించారు. ఆయనకు సోమవారం ములాఖత్ లు ఉండవచ్చు. కుమారుడు నారా లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను చంద్రబాబును కలిసేందుకు అనుమతించే అవకాశాలున్నాయి. అల్పాహారాన్ని, ఇంటి భోజనాన్ని, మందులను సహాయకుడు చంద్రబాబుకు అందిస్తారు.