Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడ  వాటి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

Six killed in Road Accident lns
Author
First Published Feb 10, 2024, 8:09 AM IST | Last Updated Feb 10, 2024, 10:36 AM IST


నెల్లూరు: జిల్లాలోని  ముసునూరు టోల్ ప్లాజా వద్ద  శనివారం నాడు తెల్లవారువారుజామున  జరిగినరోడ్డు ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు. మూడు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఆగి ఉన్న లారీని వెనుక నుండి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో  ఇదే రూట్ లో ప్రయాణీస్తున్న ప్రైవేట్ బస్సు కూడ లారీని ఢీకొట్టింది. ఈ బస్సు చెన్నై నుండి హైద్రాబాద్ కు వస్తుంది.ఈ ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు.  మరో  23 మంది గాయపడ్డారు.  గాయపడిన వారిని సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు.  

also read:ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు.బాధితులను నెల్లూరు, ఒంగోలు ఆసుపత్రికి తరలించినట్టుగా ఎస్పీ ప్రకటించారు.బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా ఎస్పీ వివరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం  9440796383 నెంబర్ కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.

కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఈ ప్రమాదం పై స్పందించారు.  ఈ ప్రమాద ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టుగా  ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి  చెప్పారు.బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

also read:పీ.వీ.నరసింహారావు: నెహ్రు-గాంధీయేతర ఫ్యామిలీ నుండి ప్రధానిగా

అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు  ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. రోడ్డుకు సంబంధించిన సమాచారం కూడ సైన్ బోర్డుల ద్వారా తెలియజేస్తారు. అయితే  వీటిపై అవగాహన లేకపోవడం కూడ  ప్రమాదాలకు కారణంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారులపై వాహనాలు  స్పీడుగా ప్రయాణిస్తుంటాయి. వాహనాల స్పీడ్ ను కంట్రోల్ చేసే క్రమంలో  వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం కూడ ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios