అభ్యర్ధులపైన లేకపోతే వారికి ప్రపోజ్ చేసిన మద్దతుదారులపై తీవ్రమైన ఒత్తిళ్ళు తెచ్చింది.
తెలుగుదేశం పార్టీ బాగా అతి చేస్తున్నట్లే కనిపిస్తోంది. స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్దానాల ఎన్నికల్లో అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరు విస్తు గొలుపుతోంది. తొమ్మిది స్ధానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఆయా జిల్లాల్లో టిడిపికి ఉన్న బలం రీత్యా 6 స్ధానాల్లో గెలవటం సులువే. వైసీపీ ఎటుతిరిగీ నామినేషన్లు వేయలేదు. ఇక రంగంలో ఉన్నది స్వతంత్య్ర అభ్యర్ధులు మాత్రమే. ఇక్కడే అధికారపార్టీ నేతల అతికనబడుతోంది. అసలు ఎన్నిక జరగాన్నే ఇష్టపడలేదు. ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నా టిడిపికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా స్వతంత్రులు నామినేషన్లు వేయటాన్ని సహించలేకపోయింది. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో టిడిపి బలం ఎక్కువ. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ బలం ఎక్కువ.
తనకు బలమున్న చోట్ల తన అభ్యర్ధులందరినీ ఏకగ్రీవంగా గెలిపించు కోవాలని అనుకున్నది టిడిపి. అనుకున్నదే తడవుగా నామినేషన్లు వేసిన స్వతంత్ర్య అభ్యర్ధులపై ఒత్తిడి మొదలుపెట్టింది. వారిని వదిలేసినా అధికార పార్టీ అభ్యర్ధులు గెలుపు ఖాయమే. అభ్యర్ధులపైనే లేకపోతే వారికి ప్రపోజ్ చేసిన మద్దతుదారులపై తీవ్రమైన ఒత్తిళ్ళు తెచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో నామినేషన్ ఉపసంహరణకు మామిడి శ్రీకాంత్ అంగీకరించలేదు. దాంతో ఆయన వ్యాపారాలపై అధికారులు దాడులు జరిపి అన్నింటినీ మూసేయించారు. దాంతో మామిడి దారిలోకి రాక తప్పలేదు. ఇదే పద్దతిలో అందరినీ దారికి తెచ్చుకున్నది.
అదే సమయంలో, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో తగిన బలం లేకపోయినా వైసీపీ అభ్యర్ధులపై పోటీకి దిగింది. వైసీపీ ఓటర్లను ప్రలోబాలకు గురిచేయటం, ఒత్తిళ్ళు తేవటం లాంటి చర్యలతో గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ తరపున శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు, తూర్పుగోదావరి నుండి చిక్కాల రామచంద్రరావు, పశ్చిమగోదావరి నుండి అంగర రామ్మోహన్ రావు, ఎం. వెంకట సత్యనారాయణరాజు, అనంతపురం నుండి జి. దీపక్ రెడ్డి, చిత్తూరు నుండి బిఎన్ రాజసింహులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే.

