విజయవాడ

: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ఆవుల మృతి ఘటనపై సిట్ బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పశుగ్రాసంలో చేరిన టాక్సిసిటీ వలనే ఆవులు చనిపోయినట్లు తన నివేదికలో స్పష్టం చేసింది. 

వివరాల్లోకి వెళ్తే కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఆగష్టు 10న 90 ఆవులు మరణించాయి. ఒక్కసారిగా గోశాలలో 90 ఆవుల మృతి చెందడంపై వివాదాస్పదంగా మారింది. ఆవుల మృతిపై రకరకాల ప్రచారం జరిగాయి. 

బీజేపీతోపాటు, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. గోశాలలో కుట్ర జరిగిందని ఆరోపించారు. మరోవైపు ఆవుల మరణంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శైవ క్షేత్రం పిఠాధిపతి శివస్వామి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న శివస్వామి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. శ్రావణమాస శుక్రవారం గోవుల మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆవుల మరణ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏకంగా వందకు పైగా ఆవులు చనిపోవడం అనేది హృదయ విదారకమని శివానంద ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దాంతో ప్రభుత్వం ఆవుల మృతిపై సిట్ విచారణకు ఆదేశించింది జగన్ ప్రభుత్వం. విచారణ చేపట్టిన సిట్ బృందం ప్రాథమిక నివేదికలో సైతం టాక్సిసిటీ వల్లే ఆవులు చనిపోయినట్లు తెలిపింది. 

ఇకపోతే ఆవుల మరణంపై విచారణ పూర్తి చేసిన సిట్ బృందం తన నివేదికను విజయవాడ సీపీకి  అందజేసింది. పశుగ్రాసంలో చేరిన టాక్సిసిటి వలనే ఆవులు చనిపోయినట్టు నిర్దారించింది. 

ప్రకాశం జిల్లా నుండి వచ్చిన గడ్డిలో రసాయనాల శాతం అధికంగా ఉన్నట్టు సిట్ దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడైనట్లు తెలిపింది. టాక్సిసిటి అధికంగా ఉన్న పశుగ్రాసం తినడం వల్లే అవి నైట్రెట్లుగా మారి పశువుల ప్రాణం తీసినట్టు సిట్ దర్యాప్తు సంస్థ తెలిపింది. సిట్ దర్యాప్తు చేపట్టిన నివేదికను విజయవాడ సీపీకి అందజేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడలో గోవుల మృతి: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
గోవుల మృతి: నిర్వాహకులపై కమలానంద అనుమానం