విజయవాడలో గోవులు మరణించిన గోశాలను ఆదివారం భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద సరస్వతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గో సంరక్షణకు కేంద్రం రూ. 1,500 కోట్లు కేటాయించిందని.. ఆ డబ్బులు ఏ ఏ గోశాలలకు ఇచ్చారో చెప్పాలని కమలానంద డిమాండ్ చేశారు.

ఒకేసారి ఇన్ని ఆవులు చనిపోవడం బాధాకరమని.. ఈ ఘటనలో గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లుగా అనిపిస్తుందని ఆయన ఆరోపించారు. గోశాలలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని కమలానంద అభిప్రాయపడ్డారు.

విజయవాడ నగర శివారులోని కొత్తూరు తాడేపల్లిలో ఉన్న గోశాలలో శనివారం 110 ఆవులు మరణించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

విజయవాడలో కలకలం.. ఒకేసారి 100 ఆవులు మృతి (వీడియో)

105 ఆవుల మృతికి కారణమిదే: తేల్చిన వైద్యులు