Asianet News TeluguAsianet News Telugu

దొంగగారి అదృష్టం: దేవుడు కలలోకొచ్చి తప్పొప్పుకొమ్మన్నాడు

సాక్షాత్తు దేవుడి జోక్యంతో సెటిలయిపోయిన దొంగతనం కేసు

simhachalam god persuades a thief to admit theft

భక్త రామదాసు మనకు బాగా పరిచయమున్నోడు. శ్రీరాముడి ప్రసన్నం కోసం ఆయన  పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన కట్టిన ఆలయంలో కొలువై, ఆయన చేయించిన నగలను వాళ్ల ‘అబ్బ సొమ్ము’లాగా వేసుకుని కులికాడే తప్పరామచంద్రడెప్పడైనా క్షణం తీరికచేసుకుని రామదాసుకు కనిపించాడా?

లేదు, సరిగదా, ఎవరో తానీషాకు కనిపించి రామదాసును మరీ కృంగదీశాడు. కడపు మండిన రామదాసు దేవుడని చూడకుండా రాముడిని ఏకి పడేశాడు.

 

ఇపుడు ఇలాగే, సింహాచలం అప్పన్న కూడా కనిపించాల్సిన వాడికి కనిపించకుండా, తనను రోజూ అట్టిపెట్టుకుని సేవచేస్తున్న  వాళ్ల కలలోకి వెళ్లకుండా, ఎవరో దొంగ కలలోకనిపించి చాలా కథ నిడిపించాడు. దైవలీల, మనమేమనగలం, strange are the ways of god.

 

చెప్పొచ్చేదేమంటే, సింహాచలం అప్పన్న పసుపులేటి రాంబాబు అనే దొంగ కలలోకి వచ్చి,  ‘రాంబాబూ , తప్పుచేశావ్ నాయనా, దొంగతనం ఒప్పుకో, పో, పోయి అరెస్టు కా. తలనీలాలు దొంగిలించి ఇలా తప్పించుకు తిరుగుతున్నావ్. వద్దు నాయన, తప్పొప్పుకో,’ అని చెప్పాడట.

 

 ఈ విషయాన్ని రాంబాబు స్వయంగా తనకు తెలిసిన ఒక ఆలయం ఎగ్జిగ్యూటివ్ ఆపీసర్ కు ఫోన్ చేసి చెప్పాడు.

 

దీనితో ఆ ఇవొ సింహాచాలం  అప్పలనరసింహస్వామి ఆలయం ఇవొకు చెప్పాడు. ఆయన వెంటనే పోలీసులకు సంగతి చేరవేశాడు.  పోలీసు రాంబాబును సముచిత పద్ధతిలో  అరెస్టుచేసి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్కడ రాంబాబు అప్పల నరసింహం కలలోకొచ్చిన విషయం డిసిపి రవికుమార్ మూర్తి ఎదురుగా నే  చెప్పాడు.

 

ఇంతకు రాంబాబు ఏమిచేశాడో తెలుసా?

 

సింహాచలం గుడినుంచి  భక్తుల 10 బస్తాల 150 కిలోల తలనీలాలను చోరీ చేశాడు. వాటివిలువ రు. 7 లక్షల దాకా ఉంటాయి. ఇందులో 4.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

 

రాంబాబు కుటుంబానికి తలనీలాలవ్యాపారమే జీవినాధారం.ఎటొచ్చి అవి ఎత్తుకొచ్చిన తలనీలాలే. పూర్వం, తండ్రి సింహాచలం చేసే తలనీలాల దొంగతనానికి సహకరిస్తూ విద్యలో ఆరితేరాడు. తండ్రి చనిపోయాక, స్వయంగా రంగంలోకి దిగాడు. ఇతగాడికి జంపన అనేతొడు దొంగ కూడా ఉన్నాడు. ఇలా దొంగతనంచేసిన తల నీలాలను బ్రోకర్లకు సరఫరాచేసేవాడు.మెల్లిగా బెంగాల్ ఒరిస్సారాష్ట్రాలకు ‘ఎగుమతి‘ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలసి కాణిపాకం, మాలకొండ ప్రాంతాలలో తలనీలాలు దొంగతనం చేశారు. అదీ కత.

 

2015 లో సింహాచలం తలనీలాలను దొంగతనం చేసినపుడు ఇవొ రామచంద్రమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ఇలా దేవుడి జోక్యంతో సెటిల్ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios