నెల్లూరు జిల్లాలో ఓ ఎస్ఐ వికృతరూపం బయటపడింది. జిల్లాలోని సైదాపురం పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏడుకొండలు అనే ఎస్ఐ ఊటుకూరు మహిళా సర్పంచ్ పద్మజపై కన్నేసాడు. దాంతో ప్రతీరోజు సర్పంచ్ కు ఫోన్ చేసి వేధించటం మొదలుపెట్టాడు.
నెల్లూరు జిల్లాలో ఓ ఎస్ఐ వికృతరూపం బయటపడింది. జిల్లాలోని సైదాపురం పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏడుకొండలు అనే ఎస్ఐ ఊటుకూరు మహిళా సర్పంచ్ పద్మజపై కన్నేసాడు. దాంతో ప్రతీరోజు సర్పంచ్ కు ఫోన్ చేసి వేధించటం మొదలుపెట్టాడు. తనకు ఫోన్ వద్దని ఎంత మొత్తుకున్న ఎస్ఐ వినటంలేదట. తన ఫోన్ ఎత్తకపోయేసరికి వేర్వేరు ఫోన్లతో విసిగిస్తున్నారు. చివరకు అసలు ఫోన్ ఎత్తటమే మానేసారు సర్పంచ్.
Add Asianetnews Telugu as a Preferred Source


దాంతో ఎస్ఐ నేరుగా బుధవారం రాత్రి సర్పంచ్ ఇంటికి వచ్చిన ఎస్ఐ బలత్కారం చేయబోయారట. అయితే అదే సమయంలో తన ఇంటికి ఎవరో రావటంతో ఎస్ఐ వెళ్ళిపోయారట. అయితే, అప్పటికే తనకు ఫోన్ చేసి ఎస్ఐ మాట్లాడిన మాటలన్నింటినీ రికార్డు చేసి ఉంచుకున్న సర్పంచ్ చివరకు జిల్లా ఎస్పీని కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. మహిళా సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్పీ కేసు నమోదు చేసి విచారణ చేయిస్తున్నారు.
