Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో ఆక్సిజన్ కొరత: ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద బారులు

విజయవాడలో ఆక్సిజన్  కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ కోసం  ప్లాంట్ల వద్ద ప్రజలు క్యూలు  కడుతున్నారు. 

shortage of oxygen for corona patients in Vijayawada lns
Author
Vijayawada, First Published Apr 26, 2021, 5:12 PM IST

విజయవాడ: విజయవాడలో ఆక్సిజన్  కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ కోసం  ప్లాంట్ల వద్ద ప్రజలు క్యూలు  కడుతున్నారు. విజయవాడ ఆసుపత్రుల్లో ఆక్సిజన్  నిల్వలు నిండుకోవడంతో ఆక్సిజన్ ప్లాంట్ల వద్దకు  ప్రజలు, ఆసుపత్రుల సిబ్బంది క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ సిలిండర్లు లేక ఇబ్బందులు నెలకొన్న పరిస్థితులున్నాయి.

లిక్విడ్ ఆక్సిజన్ కోసం ప్లాంట్ల వద్ద హోం క్వారంటైన్ బాధితులు ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రులు, అంబులెన్స్ లలో కూడ ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో  ఆక్సిజన్ కొరతను నివారించేందుకు గాను  ఏపీ ప్రభుత్వం కేంద్రీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చర్యలు చేపట్టింది.రాష్ట్రానికి నాలుగు చోట్ల నుండి ఆక్సిజన్ ను రప్పించేందుకు  ఏపీ సర్కార్ ప్లాన్ చేసింది. 

also read:ఏపీలో కరోనా కలకలం... మరో ఎమ్మెల్యేకు పాజిటివ్

ఇదిలా ఉంటే  రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఆడిట్ ను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఆసుపత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్ లెక్కలను తీస్తోంది. రోజూవారీ ఆక్సిజన్ వినియోగం, ఆక్సిజన్ పడకలపై ఆరా తీస్తోంది.ప్రతి రోజూ ఏపీకి 330 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం, అయితే ప్రస్తుతం దాదాపు 290 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్  ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 42 ఫిల్లింగ్ స్టేషన్ల నుండి ఆసుపత్రులకు నేరుగా ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios