ఏపీలో కరోనా కలకలం... మరో ఎమ్మెల్యేకు పాజిటివ్

ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

TDP  MLA Bendalam Ashok tests positive for COVID19 akp

అమరావతి: సామాన్యులు, వీఐపీలు అన్న తేడా లేదు... కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇక నిత్యం ప్రజల్లో వుండే ప్రజా ప్రతినిధుల్లో చాలామంది ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే అశోక్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్నారు. 

ఎమ్మెల్యే అశోక్ కరోనా బారినపడ్డట్లు తెలియడంతో వెంటనే ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. తీసుకుంటున్న వైద్యం గురించి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అశోక్ త్వరగా కోలుకుని మరింత చురుగ్గా ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు అన్నారు. 

ఇక విశాఖపట్నంలో 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు. టీడీపీ నేతలు వరుసగా కరోనాతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట్నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. 

read more   ఐసియూలో 15మంది కోవిడ్ పేషెంట్స్... నిలిచిపోయిన ఆక్సిజన్ సరఫరా...

చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్ కరోనా మృతి చెందడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కటారి ప్రవీణ్ కుటుంబం మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని, పార్టీ బలోపేతానికి కృషిచేశారన్నారు.  

అలాగే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వైద్యులతో మాట్లాడారు. విశాఖలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios