పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో బాకీ తీర్చలేదని గుండు కొట్టిచ్చిన సంఘటన కలకలం రేపింది. తీసుకున్న అప్పు తీర్చకుండా విసిగిస్తున్నాడని ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ మున్సిపల్ ఉద్యోగి. 

జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆఫీసులో ఎర్రసాని విజయబాబు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. తాడేపల్లిగూడెంకు చెందిన అలకా అభిలాష్ ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఉంది. ఈ క్రమంలో అభిలాష్ ఇంటి అవసరాల నిమిత్తమని విజయబాబు దగ్గర 28 వేలు అప్పుగా తీసుకున్నాడు. 

అప్పు తీసుకున్న తరువాత చాలా రోజులవుతున్నా అభిలాష్ తిరిగి ఇవ్వలేదు. అంతేకాదు ఎన్నిసార్లు అడిగినా తీసుకున్న అప్పు తీర్చకపోవటంతో విసిగెత్తిన విజయ్ బాబు పథకం ప్రకారం అభిలాష్ ను తాడేపల్లి గూడెం రప్పించాడు. అభిలాష్ ను కారులో వచ్చిన అభిలాష్ కు విజయబాబు గుండుకొట్టించి వదిలిపెట్టాడు. 

దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విజయబాబు ఆయనకు సహకరించిన షేక్ నాగూర్ మీరావలి, కంకిరెడ్డి మార్కండేయులు, మోటూరి మణికంఠలను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.