ఏపీలో బీజేపీకి మరో ఊహించిన షాక్ తగిలింది. సీనియర్ నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు.   రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. బీజేపీ ని వీడి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

సోమవారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి.. ఆయనకు సమర్పించనున్నట్లు ఆకుల సత్యనారాయణ చెప్పారు. ఇప్పటికే రాజీనామా లేఖ సమర్పించేందుకు ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. బీజేపీ కి రాజీనామా చేసిన అనంతరం ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయంపై ఇప్పటికే ఆకుల పవన్ తో సంప్రదింపులు జరగా.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఆకుల సత్యనారాయణ అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.