విజయవాడ: అంతర్వేది రధం దగ్దం ఘటన మరువక ముందే  కృష్ణా జిల్లాలో అలాంటి దుర్ఘటనే మరోటి చోటుచేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

వీడియో

"