చంద్రబాబుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ: మతలబు?

First Published 18, Jul 2018, 10:28 AM IST
Shailajanath meets Chandrababu at Amaravati
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి కాంగ్రెసు నేత శైలజానాథ్ అమరావతి వచ్చారు. శైలజానాథ్ బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి కాంగ్రెసు నేత శైలజానాథ్ అమరావతి వచ్చారు. శైలజానాథ్ బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారి మధ్య కాసేపట్లో భేటీ జరగనుంది.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం చేకూరింది. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబును కలిశారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేనని అరుణ్ కుమార్ చెబుతున్నప్పటికీ గతంలో కాంగ్రెసు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 

ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు కాంగ్రెసు నేత శైలజానాథ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటులో తెలుగుదేశం మోడీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడిన నేపథ్యంలో శైలజానాథ్ చంద్రబాబు భేటీ అవుతున్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి శైలజానాథ్ ప్రయత్నించినట్లు చెబుతారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించలేదు. 

loader