కర్నూల్  జిల్లా కోసిగిలో  మంగళవారంనాడు  ఇరువర్గాల మధ్య  ఘర్షణ చోటు  చేసుకుంది.  ఈ ఘర్షణలో  పలువురికి గాయాలయ్యాయి. 

కర్నూల్: జిల్లాలోని కోసిగిలో మంగళవారంనాడు ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకంది. ఆలయ స్థలం విషయంలో బీసీలు, దళితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఈ విషయమై కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. .