అమరావతి: పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై సీనియర్లు కొందరు నోరు విప్పారు. పార్టీ ప్రక్షాళన కోసం చంద్రబాబు నడుం బిగించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసేవారికి పట్టం కట్టాలని నేతలు కోరారు. మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడులు టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

 పార్టీలో స్వార్ధపరులకు పదవులు ఇస్తున్నారు, పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించి పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ సీనియర్లు అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు విజయవాడలో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన మనసులో మాటను బయటపెట్టారు.

పార్టీలో  యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబునాయుడుకు బుచ్చయ్య చౌదరి సూచించారు. తనను తప్పించి టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీలకు కేటాయించాలని బుచ్చయ్య చౌదరి చంద్రబాబును కోరారు. పార్టీలో చోటు చేసుకొన్న అన్యధోరణులపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.

మరో సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు మాసాలు మాత్రమే అవుతోంది. ఇప్పుడే ప్రభుత్వంపై నిరసనకు దిగడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం తప్పులు చేయనివ్వాలి, ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజల్లోకి  వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఆకలి వేసినప్పుడే అన్నం పెట్టాలి..  అప్పుడే గుర్తుకు ఉంటామని ఆయన వివరించారు.

అధికారంలో ఉన్న సమయంలో ఆకలి కాకున్నా అన్నీ సమకూర్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.మొదటి రోజు నుండే యుద్దం చేస్తే అసలు సమయంలో శక్తి లేకుండా పోతోందని అయ్యన్నపాత్రుడు చెప్పారు.  పార్టీ ప్రక్షాళన కోసం 

ప్రభుత్వం తీసుకొన్న విధానపరమైన  నిర్ణయాలపై  నోరు మెదపకపోతే ప్రజల్లో తప్పుడు  సంకేతాలు వెల్లే ప్రమాదం ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. 


సంబంధిత వార్తలు

చంద్రబాబు భేటీకి కేశినేని, గంటా సహా సీనియర్ల డుమ్మా, కారణం...?

పార్టీలో సమూల మార్పులకు చంద్రబాబు శ్రీకారం

ప్రజలు తిరగబడితే వైసీపీ నిలువదు: చంద్రబాబు

రాజీనామా చేస్తా: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన