మదనపల్లె లో పట్టపగలే దారుణం : మహిళా న్యాయవాదిని కత్తులతో నరికి చంపిన దుండగులు

First Published 30, May 2018, 4:28 PM IST
senior lawyer murder at madanapalle
Highlights

చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం

చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడి రోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యతో మదన పల్లెలో తీవ్ర కలకలం రేగింది.

ఈ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మదన పల్లికి చెందిన జితేంద్ర- నాగజ్యోతి భార్యాభర్తలు. ఇద్దరూ న్యయవాద వృత్తిలోనే ఉన్నారు. అయితే ఇవాళ నాగజ్యోతి స్కూటీపై ఇంటికి వెళుతుండగా మార్గ మద్యలో కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఘటనా స్థలంలోనే కుప్పకూలి మృతిచెందారు. 

అయితే పట్టపగలు ఒంటి గంట సమయంలో అత్యంత రద్దీగా ఉండే ఎస్బీఐ కాలనీలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. ఈ దాడికి పాల్పడిని దుండగులు విచ్చలవిడిగా ఆమెపై దాడికి పాల్పడి సునాయాసంగా అక్కడినుండి పారిపోయారు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లను రప్పించి ఆధారాలు, నిందితుల కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 
 
మృతురాలితో పాటు ఆమెభర్త కూడా ప్రముఖ న్యాయవాదులు కావడంతో ప్రత్యర్థులెవరైనా దాడికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతే కాకుండా వీరికి వ్యక్తిగత గొడవలు, వఈత్తిపరమైన విభేదాలు ఏమైనా ఉన్నయా అన్న కోణంలో పోలీసు

loader