ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కన్నబాబు నియమితులయ్యారు. కన్నబాబు గతంలో పురపాలకశాఖ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా రవిచంద్రను నియమించాలని కోరుతూ అంతకు ముందు ఎస్ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఏపీ ప్రభుత్వం రవిచంద్రను కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read:అది ఆప్షన్ మాత్రమే... ఏకగ్రీవాలకు నేను వ్యతిరేకం: ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలనం

పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం కమిషన్‌ పనితీరుపై ప్రభావం చూపుతోందని, కార్యదర్శి పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ ఇటీవల లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు రాజబాబు, విజయ్‌కుమార్‌, కన్నబాబు పేర్లను ప్రతిపాదించింది. వీటిని పరిశీంచిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. కన్నబాబును ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు విపత్తుల నిర్వహణ శాఖ , మత్స్యశాఖ‌ కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది.