విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఎల్జీ పరిశ్రమలో గురువారం నాడు ఉదయం రెండోసారి గ్యాస్ లీకైంది. దీంతో పరిసరాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది కూడ ఈ ప్రాంతం నుండి తరలించారు.

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి గురువారం నాడు తెల్లవారుజామున విషవాయువు గ్యాస్ లీకైంది.  గురువారం నాడు ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో మరోసారి స్వల్పంగా గ్యాస్ లీకైందని స్థానికంగా ఉన్న మీడియా రిపోర్ట్ చేసింది.

ఓ తెలుగు న్యూస్ ఛానల్  గ్యాస్ రెండో సారి లీకైనట్టుగా. ప్రకటించింది. దీంతో అధికారులు వెంటనే అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఈ ఫ్యాక్టరీకి సమీపంలోనే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఉంది. 

also read:ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు: విశాఖ సీపీ ఆర్ కే మీనా

రెండోసారి గ్యాస్ లీకైనట్టుగా వాసన రావడంతో అధికారులు స్థానికంగా ఉన్నవారిని వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. సహాయ సిబ్బంది కూడ అక్కడి నుండి పరుగులు తీశారు.ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా సిబ్బందితో పాటు రెస్క్యూ  సిబ్బంది, స్థానికులు పరుగులు తీశారు.స్థానికులను హెచ్చరిస్తూ అలారం మోగించారు. ఈ అలారం మోగడంతో వారంతా అక్కడి నుండి పరుగులు తీశారు.