విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామాన్ని ఖాళీ చేయించినట్టుగా విశాఖ సీపీ ఆర్ కే మీనా తెలిపారు.

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి గురువారం నాడు తెల్లవారుజామున  ఉదయం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

also read:విశాఖలో గ్యాస్ లీకేజీ: జగన్‌కి మోడీ ఫోన్, పలువురి సంతాపం

గ్యాస్ లీకైన ఘటనకు సంబంధించి తీవ్రంగా దెబ్బతిన్న వెంకటాపురం గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించినట్టుగా విశాఖ కమిషనర్ ఆర్ కె మీనా చెప్పారు.  ఈ గ్యాస్  ప్రభావం సుమారు కిలోమీటరున్నర వరకు ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాస్ లీకేజీని అరికట్టినట్టుగా ఆయన ప్రకటించారు.  విశాఖలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.తమకు సమాచారం రాగానే తమ సిబ్బంది బాధితులను ఆసుపత్రులకు తరలించినట్టుగా ఎస్పీ మీనా తెలిపారు.