Asianet News TeluguAsianet News Telugu

మెడికల్ కేర్ లో రఘురామ: ప్రకటన విడుదల చేసిన ఆర్మీ ఆస్పత్రి

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు అందే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటారు.

Secendurabad Army hospital releases statement on Raghrama Krishnama Raju
Author
Secunderabad, First Published May 19, 2021, 6:39 AM IST

హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు వైద్య పరీక్షలపై సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. రఘురామకు ముగ్గురు వైద్యుల మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

రఘురామ కృష్ణమ రాజు మెడికల్ కేర్ లో ఉన్నారని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయని చెప్పింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తమ వద్దే రఘురామ ఉంటారని చెప్పింది. కోవిడ్ నిబంధనల మేరకు రఘురామ కృష్ణమ రాజుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. 

Also Read: రఘురామకు తొలిరోజు వైద్య పరీక్షలు పూర్తి.. 21న సుప్రీంకోర్టుకు నివేదిక

సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణమ రాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. రఘురామకు నిర్వహించిన వైద్య పరీక్షలను వీడియోలో చిత్రీకరించారు. సీల్డ్ కవర్ లో వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సీల్డ్ కవర్ లో పంపిస్తారు. రిజిస్ట్రార్ జనరల్ నివేదికను సుప్రీంకోర్టు అందిస్తారు. 

శుక్రవారం నాటికి ఇదంతా పూర్తవుతుందని భావిస్తున్నారు. శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణమ రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ బెయిల్ పిటిషన్ మీద గురువారంనాడు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఏపీ సీఐడిని ఆదేశించింది.

Also Read: రఘురామకు ముగ్గురు వైద్యుల పరీక్షలు: జ్యుడిషియల్ అధికారిగా నాగార్జున

సిఐడి కస్టడీలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తనను కర్రలతో, ఫైబర్ తాళ్లతో తన పాదాలపై కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిజీహెచ్ లోనూ రమేష్ ఆస్పత్రిలోనూ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, గుంటూరు జీజీహెచ్ లో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. గుంటూరు వైద్య బృందం కోర్టుకు నివేదిక అందజేసింది. 

రఘురామకృష్ణమ రాజుకు అయిన గాయాలు కొట్టడం వల్ల అయినవి కావని, ఎడెమా వల్ల అరిపాదాలు కమిలినట్లు అయ్యాయని వైద్యుల బృందం తేల్చింది. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించకపోవడంతో రఘురామ కృష్ణమ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

రఘురామ కృష్ణమ రాజు తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు రఘురామకృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్సీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios