రఘురామకు తొలిరోజు వైద్య పరీక్షలు పూర్తి.. 21న సుప్రీంకోర్టుకు నివేదిక

రఘురామకృష్ణంరాజుకు తొలి రోజు వైద్య పరీక్షలు ముగిశాయి. న్యాయాధికారి సమక్షంలో ఎంపీకి పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షలు, ల్యాబ్ రిపోర్ట్స్‌ వీడియోగ్రఫీ చేసి సీల్డ్ కవర్‌లో భద్రపరిచారు అధికారులు

first day medical tests completed for ysrcp mp raghu rama krishnam raju ksp

రఘురామకృష్ణంరాజుకు తొలి రోజు వైద్య పరీక్షలు ముగిశాయి. న్యాయాధికారి సమక్షంలో ఎంపీకి పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షలు, ల్యాబ్ రిపోర్ట్స్‌ వీడియోగ్రఫీ చేసి సీల్డ్ కవర్‌లో భద్రపరిచారు అధికారులు. మెడికల్ రిపోర్ట్‌ను ఈ నెల 21న సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు న్యాయాధికారి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణంరాజు వుండున్నారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాడు రాత్రి గుంటూరు జైలు నుంచి రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల పర్యవేక్షణకు హైకోర్టు రిజిస్ట్రీ నాగార్జునను తెలంగాణ హైకోర్టు నియమించింది.ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలను  వీడియో రికార్డు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.   

Also Read:నన్ను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర: రఘురామ కృష్ణమ రాజు

తొలుత షుగర్ తో పాటు జ్వరంతో ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై వైద్యులు పరీక్షించారు. దీంతో పాటు జనరల్ చెకప్ చేశారు. కస్టడీలో తనపై దాడి చేశారని ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో  ఈ విషయమై కూడ వైద్యులు  పరీక్షించనున్నారు. ఈ నెల 14వ తేదీన  కస్టడీలో పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణంరాజు విజయవాడ కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios