వేములవాడ పాఠశాల వ్యాన్ బోల్తా పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన మరచిపోకముందే నెల్లూరు జిల్లాలో మరో స్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురైంది. వెంకటగిరి శ్రీచైతన్య పాఠశాలకు విద్యార్ధులతో వెళ్తున్న బస్సు డక్కిలి మండలం కుప్పాయపాలెం వంతెనపై బోల్తాపడింది.

ఈ ఘటనలో 15 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన విద్యార్ధులను డక్కిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

వేములవాడలో స్కూల్ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు చిన్నారుల దుర్మరణం