మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ పై కేసు నమోదైంది. అతనిపై ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును కించ పరుస్తూ ఎన్ఆర్ఐ ఎడ్లపల్లి సుధాకర్ చౌదరి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. మంత్రిని తక్కువ చేస్తూ దారుణంగా అతను పోస్టులు పెట్టాడు. కాగా  ఆ ఎన్‌ఆర్‌ఐపై ఎస్సీ, ఎస్టీ కింది కేసు నమోదు చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నేతలు పాటిబండ్ల సుదాకర్, కాకుమాను యలమందరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఆర్ఐ సుధాకర్ చౌదరి గుంటూరు జిల్లా  వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడు వాసిగా తెలుస్తోంది.